Header Banner

ముంబయి ఆట మరో లెవల్... వరుసగా ఐదో విజయం! లక్నో స్కోరు?

  Sun Apr 27, 2025 20:49        Sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో రియాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకాలతో చెలరేగగా, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లక్నో పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలోనే తడబడింది.

 

ఇది కూడా చదవండి: అమరావతిలో మోదీ పర్యటన! కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన!

 

ఓపెనర్ ఐడెన్ మార్క్‌రమ్ (9)ను బుమ్రా, నికోలస్ పూరన్ (27)ను విల్ జాక్స్, రిషభ్ పంత్ (4)ను విల్ జాక్స్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. మిచెల్ మార్ష్ (34 పరుగులు, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని (35 పరుగులు, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు పోరాడినప్పటికీ ముంబయి బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. డేవిడ్ మిల్లర్ (24) కూడా విఫలమయ్యాడు. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా కేవలం 22 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. విల్ జాక్స్ 2 వికెట్లు, కోర్బిన్ బాష్ 1 వికెట్ సాధించారు. ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఎంఐ జట్టుకు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia